: శ్రీవారి సమాచారం
ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఈ ఉదయానికి 5 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఒక్క సర్వదర్శనం మినహా అన్ని దర్శనాలను రద్దు చేశారు. ఈ రోజు అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. రేపు స్వామివారిని తిరువీధుల్లో బంగారు రథంపై ఊరేగిస్తారు.