: నేటి నుంచి నవ్యాంధ్ర రాజధాని కోసం భూ సమీకరణ


నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం కోసం అవసరమైన భూ సమీకరణ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. రాజధాని భూ సమీకరణకు సంబంధించి ఇప్పటికే సీఆర్డీఏ చట్టానికి ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. చట్టంపై రెవెన్యూ అధికారులకు సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ నిన్న అవగాహన కూడా కల్పించారు. ఈ నేపథ్యంలో బృందాలుగా విడిపోనున్న రెవెన్యూ యంత్రాంగం రైతుల నుంచి భూమి సమీకరించడంతో పాటు వారికి భూమి స్వాధీనత పత్రాలను జారీ చేయనుంది. డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలో ఏర్పాటయ్యే ప్రత్యేక బృందాల్లో ఇద్దరేసి తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, తగినంత మంది సర్వేయర్లు ఉంటారు. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయం నుంచి నేడు గుంటూరు జిల్లా చేరుకునే అధికారులు కూడా భూ సమీకరణలో పాలుపంచుకోనున్నారు. సాధ్యమైనంత త్వరగా భూ సమీకరణను పూర్తి చేయాలని చంద్రబాబు సర్కారు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నేటి నుంచి మొదలయ్యే భూ సమీకరణ వేగంగా పూర్తి కానుంది.

  • Loading...

More Telugu News