: ఆదాయం పెరిగితే స్పెషల్ ఇంక్రిమెంట్ ఇస్తాం: కేసీఆర్
తెలంగాణలో ఆదాయం పెరిగితే ఉద్యోగులకు మరో స్పెషల్ ఇంక్రిమెంట్ ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాదులోని రవీంద్రభారతిలో టీఎన్జీఓ డైరీ ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనవరి మూడో వారంలో తెలంగాణ ఉద్యోగులకు పీఆర్సీపై ప్రకటన చేస్తామని అన్నారు. తాము ప్రకటించే పీఆర్సీ అందరికీ నచ్చేలా ఉంటుందని అన్నారు. అలాగే భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే ఒకే చోట పనిచేసేలా ఆదేశాలు జారీ చేస్తామని ఆయన ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేత కోదండరామ్ పాల్గోవడం విశేషం.