: ఉత్తరాఖండ్ గవర్నర్ గా కేకే పాల్ నియామకం
ఉత్తరాఖండ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా కృష్ణకాంత్ పాల్ నియమితులయ్యారు. ఉత్తరాఖండ్ గవర్నర్ గా ప్రస్తుతం అజీజ్ ఖురేషీ భాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అజీజ్ ఖురీషీని మిజోరం గవర్నర్ గా బదిలీ చేసిన కేంద్ర ప్రభుత్వం, ఆయన స్థానంలో కేకే పాల్ ను ఉత్తరాఖండ్ గవర్నర్ గా నియమిస్తూ ఆదేశాలు జారీచేసింది.