: విమాన శిథిలాల కోసం 21 మంది గజ ఈతగాళ్లు
జావా సముద్రంలో కూలిపోయినట్టు భావిస్తున్న ఎయిర్ ఏషియా విమాన శిధిలాలు గుర్తించేందుకు ఇండోనేషియా నావికాదళానికి చెందిన 21 మంది గజ ఈతగాళ్లను రంగంలోకి దింపినట్టు ఆ దేశ నావికాదళం వెల్లడించింది. ఇండోనేషియాలో మధ్య కలిమంతన్ సమీపంలోని సముద్రజలాల్లో వీరు గాలిస్తున్నారు. రాడార్ తో విమానం కమ్యూనికేషన్ సంబంధాలు తెగిపోయిన ప్రాంతానికి 10 కిలో మీటర్ల దూరంలో విమాన శిధిలాలను గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు.