: ఏ మతాన్ని అగౌరవపరచలేదు: 'పీకే' దర్శకుడు
'పీకే' సినిమా ద్వారా తాము ఏ మతాన్నీ కించపరచలేదని ఆ సినిమా దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ తెలిపారు. ముంబైలో ఆయన మాట్లాడుతూ, తాము అన్ని మతాల విశ్వాసాలను గౌరవిస్తామని అన్నారు. తాము సినిమాలో గ్రహాంతరవాసి యొక్క అనుభవాలను సినిమాలో చూపించామే తప్ప సినిమాలో ఏ మతాన్నీ కించపరచలేదని ఆయన పేర్కొన్నారు. కాగా, 'పీకే' సినిమాను ఆపేయాలని పలు మత సంఘాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.