: సల్మాన్ ఖాన్ పై తమిళనాట విమర్శల వెల్లువ
బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ పై తమిళనాడులో విమర్శలు వెల్లువెత్తున్నాయి. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ఆ దేశాధ్యక్షుడు మహింద రాజపక్స తరపున సల్లూ భాయ్ ప్రచారం చేయనున్నాడు. దీనిపై తమిళనాట రాజకీయ పక్షాలన్నీ సల్మాన్ ప్రచారం చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శ్రీలంక నేవీ సిబ్బంది భారతీయ మత్స్యకారులపై దాడులకు దిగుతున్నారని, అవన్నీ శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స ఆదేశాల మేరకే జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఇలాంటి సమయంలో సల్మాన్ అధ్యక్షుడు రాజపక్స తరపున ప్రచారం చేయడం సరికాదని వారు సూచిస్తున్నారు. సల్లూ భాయ్ భారతీయ మత్స్యకారుల తరపున ఆలోచించి, ప్రచారం మానుకోవాలని డీఎంకే నేతలు హితవు పలికారు. కాగా, అన్నాడీఎంకే, ఎండీఎమ్ కే కూడా సల్మాన్ ప్రచారంపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి.