: మాజీ డీజీపీ అరవిందరావుపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశం


రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ అరవిందరావుపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఐపీఎస్ సుందర్ కుమార్ దాస్ 2009లో అరవిందరావుపై సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, అరవిందరావుపై కేసు నమోదు చేయడంలో పోలీసులు తాత్సారం చేశారు. ఇప్పటికీ కేసు నమోదు చేయలేదు. దీంతో, సుందర్ కుమార్ దాస్ హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన హైకోర్టు కేసు నమోదు చేయాలని, నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని సైబరాబాద్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News