: ఆసుపత్రి నుంచి జశ్వంత్ సింగ్ డిశ్చార్జ్
సీనియర్ రాజకీయవేత్త, బీజేపీ మాజీ నేత జశ్వంత్ సింగ్ ఈరోజు ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆగస్టులో తన ఇంట్లో జారిపడడంతో ఆయన తలకు బలమైన గాయం అయింది. అనంతరం ఆయన కోమాలోకి వెళ్లారు. అప్పటి నుంచి జశ్వంత్ కు న్యూరో సర్జన్ల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.