: ట్విట్టర్లో హీరోయిన్ నికితకు షాకిచ్చిన అభిమాని


సోషల్ మీడియాలో లెక్కకు మిక్కిలి అభిమానులుంటే సినీ నటులకు ఆ కిక్కే వేరు. రోజుకో ఫొటో, కామెంట్లు పెడుతూ అభిమానుల్ని అలరిస్తుంటారు నటీనటులు. తాజాగా సినీ నటి నికితా థక్రాల్ కు ఓ అభిమాని షాకిచ్చాడు. నికిత మైక్రోబ్లాగింగ్ పేజ్ లో ఓ తుంటరి తన ప్రైవేటు శరీర భాగాల ఫొటోలు పోస్టు చేశాడు. దీంతో నికిత షాకైంది. ఇది అభిమానులు తనతో మాట్లాడే చోటని, ఇలాంటి చోట్ల మతి చెడిన వ్యాఖ్యలు, పోస్టులు పెట్టవద్దని ఆ తుంటరికి చివాట్లు పెట్టింది. అతడు పోస్టు చేసిన ఫొటోలు, పెట్టిన మెసేజ్ లు అసహ్యంగా, జుగుప్సగా ఉన్నాయని తెలిపింది. ఈ సమస్య తనకొక్కదానికే ఎదురు కాలేదని, తనలాంటి చాలా మంది మహిళలు ఎదుర్కొంటున్నారని ఆమె ట్వీట్ చేసింది. కాగా, నికిత చాలా తెలుగు సినిమాల్లో నటించింది.

  • Loading...

More Telugu News