: ధోనీ రిటైర్మెంటుపై బీసీసీఐ ప్రకటన


టెస్టు క్రికెట్ నుంచి ధోనీ తప్పుకుంటున్నట్టు ప్రకటించడంపై బీసీసీఐ స్పందించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మిగతా ఫార్మాట్లలో కొనసాగేందుకు వీలుగా ఐదు రోజుల క్రికెట్ నుంచి తప్పుకోవాలన్న నిర్ణయం తీసుకున్నాడని పేర్కొంది. భారత టెస్టు క్రికెట్ మహోన్నత కెప్టెన్లలో ధోనీ ఒకడని బోర్డు కితాబిచ్చింది. అతని నాయకత్వంలో టీమిండియా టెస్టు ర్యాంకింగ్స్ లో అగ్రపీఠం అలంకరించిందని వివరించింది. తాము అతని నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు తెలిపింది. అంతేగాకుండా, టెస్టు క్రికెట్ కు ధోనీ అందించిన ఎనలేని సేవలు, ఆ సుదీర్ఘ ఫార్మాట్లో భారత్ కు సాధించిపెట్టిన విజయాలకు గాను కృతజ్ఞతలు తెలిపింది.

  • Loading...

More Telugu News