: సిరీస్ ఓటమితో వీడ్కోలు పలికాడు!


భారత క్రికెట్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా నిలిచిన మహేంద్ర సింగ్ ధోనీ టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. మెల్ బోర్న్ టెస్టు తర్వాత రిటైర్మెంటు ప్రకటించాడు. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని తెలిపాడు. సిరీస్ లో నాలుగో టెస్టుకు విరాట్ కోహ్లీ సారథ్యం వహిస్తాడని తెలుస్తోంది. గత కొంత కాలంగా టెస్టు క్రికెట్లో ధోనీ సారథ్యంపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా, విదేశాల్లో టెస్టు సిరీస్ లు ఓడిపోవడం ఈ జార్ఖండ్ డైనమైట్ కు ప్రతికూలంగా మారింది. క్రికెట్ లో మరికొంతకాలం కొనసాగాలంటే ఏదో ఒక ఫార్మాట్ ను వదులుకోవాలని గవాస్కర్, గంగూలీ వంటి మాజీ క్రికెటర్లు పలు వేదికలపై అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఆస్ట్రేలియాలోనూ సిరీస్ కోల్పోవడంతో ధోనీ మరింత ఒత్తిడికి లోనయ్యాడని భావించకతప్పదు. ఈ నేపథ్యంలోనే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతోంది. కెరీర్ లో మొత్తం 90 టెస్టులాడిన ధోనీ 38.09 సగటుతో 4,876 పరుగులు చేశాడు. వాటిలో 6 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 224. 2005లో శ్రీలంకతో చెన్నైలో జరిగిన మ్యాచ్ ద్వారా ధోనీ టెస్టు క్రికెట్ గడప తొక్కాడు. తొలి ఇన్నింగ్స్ లో ధోనీ 30 పరుగులు చేయగా, వర్షం పలుమార్లు అంతరాయం కలిగించడంతో ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది.

  • Loading...

More Telugu News