: టెస్టు క్రికెట్ కు ధోనీ గుడ్ బై
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించాడు. మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా కీర్తిగడించిన ధోనీ తాజా నిర్ణయం అందర్నీ విస్మయానికి గురి చేసింది. అకస్మాత్తుగా ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడంతో అభిమానులతో పాటు, క్రికెట్ పెద్దలు కూడా షాక్ తిన్నారు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ముగిసిన వెంటనే తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ధోనీ ప్రకటించాడు. దీంతో నాలుగో టెస్టుకు కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడని కూడా చెప్పాడు. మెల్ బోర్న్ టెస్టు తరువాత తాను టెస్టులు ఆడనని ధోనీ స్పష్టం చేశాడు. 2005లో టెస్టు క్రికెట్లోకి ధోనీ అడుగు పెట్టాడు. మొత్తం 90 టెస్టులాడిన కెప్టెన్ కూల్, 144 ఇన్నింగ్స్ ఆడాడు. 60 మ్యాచ్ లకు ధోనీ కెప్టెన్ గా వ్యవహరించాడు. అందులో 36 టెస్టుల్లో భారత్ విజయం సాధించగా, 19 టెస్టుల్లో ఓటమిపాలయింది. 28 టెస్టులు డ్రాగా ముగిశాయి. కాగా టెస్టుల్లో 4,876 పరుగులు చేసిన ధోనీ, అత్యధిక స్కోరు 224 పరుగులు. ధోనీ సారధ్యంలోనే టీమిండియా టెస్టుల్లో ప్రపంచ నెంబర్ 1 ర్యాంకు సాధించింది. టెస్టుల్లో 16 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ధోనీ 90 టెస్టుల్లో 256 క్యాచ్ లు, 134 స్టంపింగులు చేశాడు. టెస్టుల్లో అత్యధిక స్టంపింగ్ లు చేసిన వికెట్ కీపర్ గా రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు.