: నడుస్తుంటే సెల్ ఫోన్ ఛార్జింగ్... అమెరికన్ విద్యార్థుల ప్రతిభ
ఈ బూట్లు వేసుకుని ఒక గంటపాటు నడిస్తే చాలు... మీ మొబైల్ ఫోన్ ను రెండున్నర గంటల పాటు రీచార్జ్ చేసుకోవచ్చు. అమెరికాలోని కార్నెగీ మెలన్ యూనివర్సిటీ స్థాపించిన ‘సోల్ పవర్’ కంపెనీ పూర్వ విద్యార్థుల సాయంతో ఈ సాంకేతికతను అభివృద్ధి చేసింది. బూట్ల కింద సోల్ భాగం ఉండే చోట చిన్న జనరేటర్, మెకానికల్ వ్యవస్థను వీరు ఏర్పాటు చేశారు. వీటిని ధరించి నడిచినప్పుడు ఏర్పడే గతిశక్తి విద్యుత్ శక్తిగా మారి బూటుపైన ఉండే బ్యాటరీలో నిక్షిప్తమవుతుంది. ఆ తరువాత బ్యాటరీని సెల్ ఫోన్ కు కనెక్ట్ చేయడం ద్వారా ఛార్జింగ్ చేసుకోవచ్చు. వీటిని త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సోల్ పవర్ తెలిపింది.