: సముద్రంపై తేలియాడుతున్న విమాన ప్రమాద మృతదేహాలు
మిణుకుమిణుకు మంటున్న వారి ఆశలు గల్లంతయ్యాయి. తమ వారు తిరిగి రావాలని ఎందరు దేవుళ్ళకు మొరపెట్టుకున్నా ఎవరూ ఆలకించలేదు. ఇండోనేసియా నుంచి 162 మందితో సింగపూర్ బయలుదేరిన ఎయిర్ ఏషియా విమానం సముద్రంలో కూలిపోయిందనటానికి మరిన్ని ఆధారాలు లభించాయి. సముద్రంపై మృతదేహాలు తేలియాడుతూ, సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న బృందాల కంటబడ్డాయి. కొన్ని లైఫ్ జాకెట్లు కూడా సముద్రంపై కనిపించాయి. ఈ దృశ్యాలను చూసిన విమాన ప్రయాణికుల బంధువుల రోదనలు మిన్నంటాయి. కాగా, మృతదేహాలు కనిపించిన ప్రాంతంలో గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్టు అధికారులు తెలిపారు.