: బిస్కెట్ ఫ్యాక్టరీలో ఎముకల కుప్పలు!
నమ్మినా, నమ్మకున్నా ఇదో భీతిగొలిపే నిజం. ఉత్తరప్రదేశ్, మురాదాబాద్ లోని ఒక ఫ్యాక్టరీలో ఎముకలను ఉపయోగించి బిస్కెట్ లను తయారు చేస్తున్నారు. తమకందిన సమాచారం మేరకు ఆహార సరఫరా విభాగం నేతృత్వంలో ఫ్యాక్టరీపై దాడులు చేయగా ఎముకల కుప్పలు కనిపించాయని నగర మేజిస్ట్రేట్ ఏ.కే.శ్రీవాత్సవ తెలిపారు. ఆహార నాణ్యతను అక్కడ పాటించడం లేదని, బాల కార్మికులతో పని చేయిస్తున్నారని ఆయన తెలిపారు. బిస్కెట్ ఫ్యాక్టరీలో ఎముకలు ఉండటంపై విచారణ జరుపుతున్నట్టు పేర్కొన్నారు.