: తెలుగు భక్తుల కోసం శబరిమలలో ఐదెకరాల స్థలమివ్వండి: కేరళ సీఎంకు వీహెచ్ విజ్ఞప్తి
రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు కొద్దిసేపటి క్రితం కేరళ సీఎం ఊమెన్ చాందీని కలిశారు. శబరిమలలో తెలుగు రాష్ట్రాల భక్తుల కోసం ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని ఈ సందర్భంగా ఉమెన్ చాందీని వీహెచ్ కోరారు. ఈ విషయంలో అవసరమైతే ప్రభుత్వం నుంచి లేఖ కూడా అందజేస్తామని వీహెచ్ తెలిపారు. శబరిమలకు వస్తున్న తెలుగు భక్తులకు సదరు స్థలంలో వసతి సౌకర్యాలు కల్పిస్తామని వీహెచ్ చెప్పారు. తన ప్రతిపాదనకు ఊమెన్ చాందీ సానుకూలంగా స్పందించారని వీహెచ్ చెప్పారు.