: పాకిస్థాన్ లో రెండు పాఠశాలలకు నిప్పంటించిన ఉగ్రవాదులు
పాకిస్థాన్ లోని సమస్యాత్మక వాయవ్య ప్రాంతంలో రెండు ప్రాథమిక పాఠశాలలను ఉగ్రవాదులు తగులబెట్టారు. తాలిబాన్ వర్గాలు దాడులకు తెగబడవచ్చనే హెచ్చరికల మధ్య శీతాకాల సెలవులను పొడిగించిన నేపథ్యంలో ఈ ఘటనలు జరిగాయని తెలుస్తోంది. పాఠశాలలకు సెలవులు కావడంతో ప్రాణనష్టం జరగలేదు. రెండు వారాల క్రితం ఓ సైనిక పాఠశాలపై దాడిచేసిన ముష్కరులు 150 మంది చిన్నారులను పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. తమతో తెచ్చిన పెట్రోల్ తో పాఠశాలలకు నిప్పంటించారని, దీనికి బాధ్యులమంటూ ఇంతవరకూ ఎవరూ ప్రకటించుకోలేదని పోలీసు అధికారులు తెలిపారు.