: ఢిల్లీకి చేరిన ‘పీకే’ నిరసనలు... థియేటర్ పై భజరంగ్ దళ్, హిందూ సేనల దాడి
బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ తాజా చిత్రం ‘పీకే’పై హిందుత్వ వాదుల నిరసనలు దేశ రాజధాని ఢిల్లీకి చేరాయి. నిన్న అహ్మదాబాద్, భోపాల్ లో ‘పీకే’ చిత్రాన్ని ప్రదర్శిస్తున్న థియేటర్లపై దాడి జరగగా, తాజాగా ఢిల్లీలో ఆ చిత్రాన్ని ప్రదర్శిస్తున్న థియేటర్ పై దాడి జరిగింది. భజరంగ్ దళ్, హిందూ సేనల కార్యకర్తలు ఈ దాడిలో పాల్గొన్నారు. తొలుత థియేటర్ ముందు ఆందోళనకు దిగిన ఆ సంస్థల కార్యకర్తలు ఆ తర్వాత దాడికి దిగారు. ఈ దాడిలో థియేటర్ కిటికీలు ధ్వంసమయ్యాయి.