: కాశ్మీర్ లో కొనసాగుతున్న శీతలం
జమ్మూ కాశ్మీర్ లో శీతాకాల ప్రభావం అధికమవుతోంది. పలు ప్రాంతాల్లో చల్లని వాతావరణం కొనసాగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు కాశ్మీర్ లోయలో, లడక్ ప్రాంతంలో ఘనీభవన స్థితికి చేరుకోనున్నాయి. వాతావరణం పొడిగా మారేంతవరకు రాష్ట్రంలో శీతలగాలుల ప్రభావం అలాగే ఉంటుందని మెట్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. "శ్రీనగర్ లో కనీస ఉష్ణోగ్రత మైనస్ 3.8 డిగ్రీలుంటే, గుల్ మార్గ్ లో మైనస్ 4.2, పహల్గాంలో మైనస్ 6, లేహ్ పట్టణంలో రికార్డు స్థాయిలో మైనస్ 14.3, కార్గిల్ పట్టణంలో మైనస్ 13.6 డిగ్రీలు ఉంది" అని చెప్పారు. అటు జమ్మూ నగరం 5.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతతో రికార్డు నెలకొల్పిందన్నారు.