: దేశ భద్రతపై రాజ్ నాథ్ ఉన్నత స్థాయి సమీక్ష


కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దేశ భద్రతపై అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో మొదలైన ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సుహాగ్, విదేశాంగ శాఖ కార్యదర్శి సుజాతా సింగ్ లు హాజరయ్యారు. బెంగళూరులో బాంబు పేలుడు, ముంబై దాడుల కీలక సూత్రధారి జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ విడుదలపై పాక్ దుందుడుకు వైఖరి నేపథ్యంలో ఈ భేటీ జరుగుతోంది. దేశ భద్రతకు సంబంధించి పలు కీలక అంశాలపై భేటీలో చర్చ కొనసాగుతున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News