: రుణమాఫీకి బ్యాంకర్లు సహకరించాలి: చంద్రబాబు
ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్ధితి సహకరించకపోయినా రుణమాఫీ అమలు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కాబట్టి రుణమాఫీకి బ్యాంకర్లు సహకరించాలని కోరారు. మాఫీవల్ల రైతుల్లో స్థైర్యం పెరిగిందని పేర్కొన్నారు. అంతకుముందు ఏపీ సచివాలయంలో సీఎం అధ్యక్షతన బ్యాంకర్ల కమిటీ సమావేశమైంది. మంత్రి యనమల, ఎస్ఎల్ బీసీ ఛైర్మన్ తదితరులు హాజరయ్యారు. రెండో దశ రుణమాఫీ కూడా త్వరలో అమల్లోకి రానున్న నేపథ్యంలో మాఫీకి ప్రభుత్వానికి సహకరించాలని కోరేందుకే సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బ్యాంకర్లతో చంద్రబాబు సమావేశం కొనసాగుతోంది.