: 'బెంగళూరు బాంబు'ను చుట్టింది వరంగల్ జిల్లా దినపత్రికలో!
బెంగళూరు నగరంలో జరిగిన బాంబు పేలుడు కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ బాంబును అమ్మోనియం నైట్రేట్, గాజుపెంకులు, ఇనుప ముక్కలతో తయారు చేసి వరంగల్ జిల్లాలో మాత్రమే కనిపించే తెలుగు వార్తాపత్రిక టాబ్లాయిడ్ లో చుట్టారని పోలీసులు గుర్తించారు. బాంబు పేలిన ఘటనాస్థలంలో ఈ వార్తాపత్రిక ముక్కలు దొరికాయి. ఆ వెంటనే హైదరాబాద్, వరంగల్ జిల్లాకు ప్రత్యేక పోలీసు బృందాలు బయలుదేరినట్టు తెలుస్తోంది. ఈ బాంబు ఘటనలో నిందితుల వివరాలు అందించిన వారికి రూ.10 లక్షల నజరానాను ప్రకటించిన విషయం తెలిసిందే.