: భారత్ నిరసనతో మళ్లీ పాక్ అదుపులోకి లఖ్వీ
భారత్ నిరసనల నేపథ్యంలో ఇటీవల బెయిల్ మంజూరైన ఉగ్రవాది జకీర్ ఉర్ లఖ్వీని పాకిస్థాన్ మళ్లీ అదుపులోకి తీసుకుంది. వెంటనే అతనిపై కొత్త డిటెన్షన్ ఆర్డర్ జారీ చేసింది. ఈరోజు అతనిని పోలీసులు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రదారి అయిన లఖ్వీకి ఈనెల 17న పాక్ లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాన్ని వ్యతిరేకించిన భారత్ వదిలిపెట్టవద్దని తీవ్రంగా డిమాండ్ చేస్తోంది. మరోవైపు విడుదల కోసం లఖ్వీ న్యాయవాది పది లక్షల బాండ్ చెల్లించడం కూడా జరిగింది. ఈ క్రమంలో నేడో, రేపో జైలు నుంచి బయటికి వస్తాడనుకుంటున్న సమయంలో పాక్ లఖ్వీని అదుపులోకి తీసుకోవడం జరిగింది.