: వసీం అక్రం దంపతులకు అమ్మాయి పుట్టింది!
పాకిస్థాన్ పేస్ లెజెండ్ వసీం అక్రం మరోసారి తండ్రయ్యాడు. అక్రం ఆస్ట్రేలియా జాతీయురాలు షనైరాను ఏడాది క్రితం వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. షనైరా శనివారం నాడు మెల్బోర్న్ లో పండంటి అమ్మాయికి జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగానే ఉన్నారని అక్రం మేనేజర్ అర్సలాన్ షా మీడియాకు తెలిపారు. ఆ పాపకు 'అయిలా' అని పేరుపెట్టాలని నిర్ణయించారట. కూతురు పుట్టడంతో అక్రం తన ఆనందాన్ని ట్విట్టర్లో పంచుకున్నాడు. తమ కుటుంబంలోకి కొత్త వ్యక్తి వచ్చిందని ప్రకటించడానికి ఎంతో సంతోషిస్తున్నామని ట్వీట్ చేశాడు. కాగా, అక్రంకు ఇప్పటికే తైమూర్, అక్బర్ అనే ఇద్దరు కుమారులున్నారు. మొదటి భార్య హుమా అనారోగ్యంతో కన్నుమూయడం తెలిసిందే.