: రూ. 25 లక్షలు మింగి, చివరికి శవాన్నిచ్చారు ... ఆసుపత్రి ముందు ఆందోళన


వైద్యం పేరిట రూ. 25 లక్షలను వసూలు చేసిన ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే మహిళ మృతి చెందిందని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన ఎల్బీనగర్‌ లోని అవేర్ గ్లోబల్ ఆసుపత్రిలో జరిగింది. అనారోగ్యంతో ఉన్న యువతిని ఆసుపత్రిలో చేరిస్తే వివిధ పరీక్షలు, చికిత్సలు అంటూ లక్షల రూపాయలు తీసుకున్నారని, కోలుకుంటున్నదని, త్వరలో డిశ్చార్జ్ చేస్తామని చెబుతూ వచ్చిన వైద్యులు ఇప్పుడు శవాన్ని తీసుకు వెళ్ళాలని అంటున్నారని బంధువులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News