: నిలదొక్కుకున్న కోహ్లీ, రహానే
మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానేలు నిలదొక్కుకుని, సమయోచితంగా ఆడుతున్నారు. 98 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 7 ఫోర్ల సహాయంతో 54 పరుగులు చేశాడు. మరోవైపు, 68 బంతులను ఎదుర్కొన్న రహానే 5 ఫోర్లతో 33 పరుగులతో ఆడుతున్నాడు. ఇప్పటివరకు వీరిద్దరూ కలసి 85 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం భారత్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 104 పరుగులు. విజయానికి మరో 280 పరుగులు వెనుకబడి ఉండగా... చేతిలో మరో 7 వికెట్లు ఉన్నాయి.