: భారత్ ఓ బంధువు, చైనా ఒక నేస్తం: రాజపక్స
వచ్చే ఏడాది ఆరంభంలో ఎన్నికలకు సిద్ధమవుతున్న శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్స భారత్ ను బంధువుగా, చైనాను మిత్రుడిగా అభివర్ణించారు. తన నేలపై నుంచి మిత్ర, పొరుగు దేశాలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగించడాన్ని అనుమతించబోనని స్పష్టం చేశారు. తాను ఉన్నంత కాలం శ్రీలంకలో అలాంటివి కుదరవని తేల్చిచెప్పారు. చెన్నైకి చెందిన 'తంతి టీవీ' తమిళ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనోభావాలను వెల్లడించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విదేశాంగ విధానం అభిలషణీయం అన్నారు. "రెండు దేశాల మధ్య సంబంధాలు దృఢతరమయ్యేలా మోదీ తన విదేశాంగ విధానాన్ని ముందుకు తెచ్చారు. మరణశిక్ష పడ్డ ఐదుగురు భారత జాలర్లను ఆ కారణంగానే విడుదల చేయాలన్న నిర్ణయం తీసుకున్నాం" అని రాజపక్స తెలిపారు.