: నల్లగొండ వద్ద రోడ్డు ప్రమాదం... రాంగ్ రూట్‌లో వచ్చిన లారీ ఢీకొని ఐదుగురు మృతి
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. రాంగ్ రూట్లో వస్తున్న ఒక లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వాడపల్లి వాసులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు ఖలీల్, రిజ్వానా, ఫరానా, విజయ్, సైదయ్యగా గుర్తించారు. మృతదేహాలను మిర్యాలగూడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారి తాజ్ ను హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.