: నా ఫ్లెక్సీల జోలికొస్తే ఖబడ్దార్... అధికారులకు దేశం ఎంఎల్ఏ హెచ్చరికలు
విజయనగరం మున్సిపాలిటీలో ప్లెక్సీల గోల రోజు రోజుకూ పెద్దదవుతోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాజకీయ నాయకులకు చెందిన ప్లెక్సీలను తొలగించాలని వెళ్ళిన ఉద్యోగులకు చుక్కెదురైంది. గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి అప్పల నాయుడు తన ప్లెక్సీల జోలికొస్తే ఊరుకునేది లేదని మండిపడ్డారు. అసలు విషయం ఏమంటే... ఫ్లెక్సీలు మూడు నాలుగు రోజులకు మించి ఉంచరాదని తీర్మానించినా ఎందుకు అమలు చేయలేదని టౌన్ ప్లానింగ్ అధికారులపై ఎమ్మెల్యే మీసాల గీత మండిపడ్డారు. ఆమె ఆదేశాల మేరకు ముందుగా వైఎస్సార్ సీపీ, బీజేపీ ప్లెక్సీలను అధికారులు తొలగించారు. టీడీపీ ప్లెక్సీలను తీసేందుకు వెళితే, ఆ విషయాన్ని అనుచరుల ద్వారా తెలుసుకున్న గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి అప్పల నాయుడు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఆయన కమిషనర్‌కు ఫోన్ చేసి, అసలు ప్లెక్సీలు తీయమన్నది ఎవరు? తీసేయాలని చెప్పిందెవరు? అన్నట్టు తెలిసింది. దీంతో అవాక్కయిన సిబ్బంది ఆయన ప్లెక్సీలను యథాస్థానంలో తిరిగి కట్టేసారు. దీంతో, ఎమ్మెల్యేకు ఒక రూల్, మిగతా వారికి ఒక రూలా? అన్న వాదన మొదలైంది.