: వేగం తగ్గి, పెను గాలులకు గురై కూలిన ఎయిర్ ఏషియా ఫ్లైట్: నిపుణుల అంచనా


ఇండోనేసియా నుంచి 162 మందితో సింగపూర్ బయలుదేరిన ఎయిర్ ఏషియా విమానం ఆచూకీ ఇంకా లభించలేదు. మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఈ విమానం జాడ కోసం కొద్దిసేపటి క్రితం గాలింపు చర్యలు మొదలయ్యాయి. జావా సముద్రంలో కూలిపోయిందని భావిస్తున్న ఈ విమానం సముద్రం అడుగుభాగానికి చేరి ఉంటుందన్న వాదన బలపడుతోంది. ఇదిలా ఉంటే, విమానం ప్రమాదానికి గురైన క్రమానికి సంబంధించి నిపుణులు ఓ అంచనాకు వచ్చారు. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో మరింత ఎత్తుకు వెళ్లేందుకు అనుమతించాలన్న విమాన పైలట్ విజ్ఞప్తిని ఏటీసీ అధికారులు పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు చాలా సమయం తీసుకోవడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఏటీసీ నుంచి అనుమతి జాప్యం నేపథ్యంలో విమానం వేగాన్ని పైలట్ అత్యంత తక్కువ స్థాయికి తగ్గించారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానం వేగం గంటకు 160 కిలోమీటర్లకు పడిపోయింది. ఈ నేపథ్యంలో వీచిన పెనుగాలుల ధాటికి విమానం కూలిపోయింది. గగనతలంలో గంటకు 160 కిలోమీటర్ల వేగమంటే చాలా తక్కువ. ఈ వేగంతో విమానం వెళుతోందంటే, అది దాదాపుగా నిలిచిపోయినట్లే లెక్క. పైలట్ విజ్ఞప్తి ఏటీసీకి చేరిన తర్వాత దాదాపు ఆరు నిమిషాల తర్వాత విమానం కూలిపోయింది. ఆ సమయంలో అదే మార్గంలో మరో విమానం వస్తున్న నేపథ్యంలోనే ఏసీసీ నుంచి తక్షణ అనుమతి లభించలేదన్న వాదనా వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News