: రెండో వికెట్ కోల్పోయిన భారత్
మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ టాప్ ఆర్డర్ తడబడుతోంది. 384 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 5 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. ధావన్ డకౌట్ కాగా, వన్ డౌన్ గా బరిలోకి దిగిన లోకేష్ రాహుల్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి... మిచెల్ జాన్సన్ బౌలింగ్ లో వాట్సన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 12 పరుగులు. మురళీ విజయ్ (7), విరాట్ కోహ్లీ (4) క్రీజులో ఉన్నారు.