: శిఖర్ ధావన్ డకౌట్... ఇండియా 5/1
మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ కు ఆదిలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ సిరీస్ లో ఫాం లేమితో బాధపడుతున్న శిఖర్ ధావన్ మరో సారి బ్యాట్ ఎత్తేశాడు. 6 బంతులు ఎదుర్కొన్న ధావన్ పరుగులేమీ చేయకుండానే హ్యారిస్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో, 384 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ కు కోలుకోని దెబ్బ తగలినట్టయింది. కొత్త ఆటగాడు లోకేష్ రాహుల్ వన్ డౌన్ లో క్రీజులోకి వచ్చాడు. మరో వైపు మురళీ విజయ్ 4 పరుగులతో క్రీజులో ఉన్నాడు. కనీసం ముగ్గురు బ్యాట్స్ మెన్ కీలక ఇన్నింగ్స్ ఆడకపోతే... ఈ మ్యాచ్ కూడా భారత్ చేజారడం ఖాయం.