: ఢిల్లీని వీడని పొగమంచు... 14 విమాన సర్వీసులు రద్దు!
దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు వీడటం లేదు. రోజుల తరబడి ఢిల్లీని చుట్టుముట్టిన పొగమంచు నేడు కూడా నగరంలో రవాణా వ్యవస్థపై పెను ప్రభావాన్నే చూపింది. ఈ కారణంగా నేడు ఢిల్లీ నుంచి బయలుదేరాల్సిన 14 విమాన సర్వీసులు రద్దయ్యాయి. 88 విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు 90కి పైగా రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక నగరంలో రవాణా వ్యవస్థపై కూడా పొగమంచు ప్రభావం కనిపించింది. జనజీవనం కూడా పూర్తిగా స్తంభించింది.