: నేడు ఏపీ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం... రుణమాఫీపై చంద్రబాబు దృష్టి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం (ఎస్ఎల్బీసీ) నేడు జరగనుంది. ఈ సమావేశానికి ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. రాష్ట్రంలో రుణమాఫీకి సంబంధించి బ్యాంకర్లకు ఆయన పలు సలహాలు, సూచనలు చేయనున్నారు. ఇప్పటికే రుణమాఫీలో తొలిదశ పూర్తయిన సంగతి తెలిసిందే. మలిదశ రుణమాఫీ అమలుకు సంబంధించి సర్కారు తీసుకోనున్న చర్యలను ఈ సందర్భంగా ఆయన బ్యాంకర్లకు వివరించనున్నారు. రాష్ట్రంలో రుణ ప్రణాళిక అమలులో బ్యాంకర్లు వ్యవహరిస్తున్న తీరుపైనా చంద్రబాబు ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు సమాచారం.