: కర్నూలు జిల్లాలో వినూత్న కార్యక్రమం 'చెల్లికోసం'
కర్నూలు జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, ధూమపానం నిరోధించేందుకు 'చెల్లికోసం' అనే కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికీ చెల్లి అంటే చాలా ఇష్టమని, చెల్లెలి కోసం ఏవేవో చేస్తామని, అలాంటి 'చెల్లికోసం' కార్యక్రమం చేపడితే బాధ్యతగా ఉంటారని, మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండే అవకాశముందని అందుకే తాము వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పోలీసులు తెలిపారు.