: ఏబీసీడీలకు కాలం చెల్లింది... ఆర్వోఏడీకి మారాలి: నరేంద్ర మోదీ


ఏబీసీడీలకు కాలం చెల్లిందని, ఆర్వోఏడీకి ఇకపై ప్రజలంతా మారాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. మేకిన్ ఇండియా సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాలం చెల్లిన పాత విధానాలకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఇకపై ఏబీసీడీ సంస్కృతి((ఏ-ఎవైడ్, బీ-బైపాస్, సీ-కన్ప్యూజ్, డీ-డిలే)ని విడనాడాలని ఆయన సూచించారు. ఏబీసీడీ స్థానంలో ఆర్ వోఏడీ( ఆర్-రెస్పాన్సిబిలిటీ, ఓ-ఓనర్షిప్, ఏ-అకౌంటబిలిటీ, డీ-డిసిప్లేన్) అమలు చేయాలని ఆయన కోరారు. భారతదేశంలో పర్యావరణానికి హాని కలగకుండా అభివృద్ధి సాధించాలని ఆయన వివరించారు. పర్యావరణహిత పరికరాలు తయారుచేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. దేశాభివృద్ధిలో సమతుల్యం పాటించడం చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. విధాన నిర్ణయాల్లో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యానికి చోటు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. మేకిన్ ఇండియాను ప్రపంచ బ్రాండ్ గా తయారు చేయాలని మోదీ సూచించారు.

  • Loading...

More Telugu News