: ఢిల్లీలో 895 కాలనీల క్రమబద్ధీకరణ...ట్యాక్సీలకు మార్గదర్శకాలు
ఢిల్లీలోని 895 కాలనీలను క్రమబద్ధీకరించాలని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించింది. దీని ప్రకారం జూన్ 1వ తేదీ నాటికి గుర్తించిన కాలనీలను క్రబద్ధీకరించనున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. దీని కారణంగా సుమారు 60 లక్షల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరనుందని కేంద్రం అంచనా వేస్తోంది. అలాగే ఢిల్లీలోని రేడియో క్యాబ్ లకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఢిల్లీలో తిరిగే ప్రతి క్యాబ్ లో హెల్ప్ లైన్ నెంబర్లు రాసి ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే ప్రతి క్యాబ్ జీపీఎస్, జీపీఆర్ఎస్ వ్యవస్థతో అనుసంధానించుకోవాలని స్పష్టం చేసింది.