: ఆ ఘటన జలియన్ వాలాబాగ్ కంటే ఘోరం!


1993లో పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఘటన జలియన్ వాలాబాగ్ కంటే ఘోరమైనదని జస్టిస్ సుశాంత ఛటర్జీ కమీషన్ పేర్కొంది. వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉండగా, మమతా బెనర్జీ నాయకత్వంలో యువజన కాంగ్రెస్ ర్యాలీ చేపట్టింది. ఆ ర్యాలీని అడ్డుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఉత్తర్వులు అందుకున్న పోలీసులు ర్యాలీపై లాఠీలతో విరుచుకుపడ్డారు. ర్యాలీ కార్యకర్తలు ప్రతిఘటించారు. దీంతో పోలీసులు తుపాకులకు పని చెప్పారు. ఈ కాల్పుల్లో 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు. దీనిపై విచారణకు ఏకసభ్య కమీషన్ ను ప్రభుత్వం నియమించింది. సుదీర్ఘకాలం విచారణ చేసిన సుశాంత ఛటర్జీ ఏకసభ్య కమీషన్ తుది నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఘటనలో పోలీసుల తీరును తూర్పారబట్టింది. కంట్రోల్ రూం అధికారులే జరిగిన దారుణానికి బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. రాజకీయ బాసుల మెప్పుకోసం పోలీసులు ప్రజలను హత్య చేశారని నివేదిక వెల్లడించింది. బాధితులు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల నష్ట పరిహారం అందజేయాలని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News