: పరిశ్రమలకు భూసేకరణ ఇకపై సులభతరం...సవరణలకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం
ఇకపై పరిశ్రమలు ఏర్పాటు చేయడం సులువుకానుంది. భూసేకరణ, అనుమతులు, ఆందోళనలు... అంటూ పరిశ్రమల ఏర్పాటుకు అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. దీంతో భూసేకరణ చట్టంలో కీలక సవరణలకు కేంద్ర మంత్రి వర్గం పచ్చజెండా వూపినట్టు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. కేంద్ర మంత్రి వర్గ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కీలక సవరణలతో భూసేకరణ చట్ట నిబంధనలు సరళతరమవుతాయని అన్నారు. దీని కారణంగా పరిశ్రమల ఏర్పాటుకు భూసేకరణ సులువు కానుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రణాళికేతర వ్యయంపై కూడా చర్చించినట్టు ఆయన వెల్లడించారు. బొగ్గు గనుల అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్టు ఆయన తెలిపారు.