: సూరత్ ను తలదన్నేలా టెక్స్ టైల్ పార్కు: కేసీఆర్
గుజరాత్ లోని సూరత్ ను తలదన్నేలా వరంగల్ లో టెక్స్ టైల్ పార్క్ నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వరంగల్ పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ నుంచి బతుకు తెరువు కోసం సూరత్ వెళ్లిన కార్మికులను తిరిగి రప్పిస్తామని అన్నారు. వరంగల్ లో రహదారులను అభివృద్ధి చేసి, మల్టీలెవెల్ ఫ్లై ఓవర్లు నిర్మిస్తామని ఆయన తెలిపారు. ఇకపై రహదారులు, భవనాల శాఖను తుమ్మల నాగేశ్వరరావే నిర్వహిస్తారని ఆయన స్పష్టం చేశారు.