: విజయవాడ నగరపాలక సంస్థ వద్ద ఉద్రిక్తత
విజయవాడ నగరపాలక సంస్థ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నగరపాలక సంస్థ వద్దకు పెన్షన్ కోసం వచ్చిన ఓ వృద్ధురాలు మృత్యువాత పడింది. ఆమె మృతికి సమాధానం చెప్పాలంటూ కాంగ్రెస్, వామపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో, అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి, ఆందోళనకారులకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్యుద్ధం చోటుచేసుకుంది. దీంతో, ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.