: కొనసాగుతున్న కోహ్లీ, జాన్సన్ మాటల యుద్ధం


ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ జాన్సన్, టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మెల్బోర్న్ టెస్టు నాలుగో రోజు కూడా ఇదే పరిస్థితి కనిపించింది. జాన్సన్ అవుటై వెళుతుండగా కోహ్లీ పలు వ్యాఖ్యలు చేశాడు. రెండో ఇన్నింగ్స్ 68వ ఓవర్లో షమి బౌలింగ్ లో జాన్సన్ అవుటయ్యాడు. పెవిలియన్ కు వెళుతుండగా కోహ్లీ అతడిని ఉద్దేశించి ఏదో అనగా, జాన్సన్ కూడా ఏదో మాట్లాడడం కనిపించింది. అయితే, జాన్సన్... కోహ్లీకి బదులిచ్చాడా? లేక, అంపైర్లకు ఫిర్యాదు చేశాడా? అనేదానిపై స్పష్టత లేదు. అనంతరం అంపైర్లిద్దరూ కోహ్లీతో మాట్లాడారు. అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్ సందర్భంగా జాన్సన్ పలుమార్లు కోహ్లీని రెచ్చగొట్టడం తెలిసిందే.

  • Loading...

More Telugu News