: కుదిరిన బేరం... బీజేపీ మద్దతుతో కాశ్మీర్ పీఠంపై ముఫ్తీ మహ్మద్ సయీద్!
జమ్మూకాశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా పీడీపీ, బీజేపీల మధ్య ఒప్పందం దాదాపు కుదిరినట్లు తెలుస్తోంది. పీడీపీ అధినేత ముఫ్తీ మహ్మద్ సయీద్ ముఖ్యమంత్రిగా రెండు పార్టీల సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం. పీడీపీ సీఎం పదవితోపాటు ఆరు మంత్రిపదవులు స్వీకరిస్తుందని, బీజేపీ ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు 8 మంత్రి పదవులు తీసుకుంటుందని పీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, బీజేపీ సైతం పీడీపీతో జట్టు కట్టే అంశంపై సానుకూల సంకేతాలు ఇస్తోంది. రాష్ట్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో తాము తప్పక ఉంటామని బీజేపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. పొత్తు ఒప్పందంపై రేపు కీలక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.