: అమెరికాను అభ్యర్థించిన ఇండోనేషియా, మలేసియా
ఇండోనేషియా నుంచి సింగపూర్ వెళుతూ ఆదివారం ఉదయం అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానాన్ని గాలించేందుకు సోనార్ పరికరాలు అందజేయాలని ఇండోనేషియా, మలేసియా దేశాలు అమెరికాను అభ్యర్థించాయి. ఎయిర్ ఏషియా విమానం జావా సముద్రంలో అడుగుభాగానికి చేరుకుని ఉంటుందని, బ్లాక్ బాక్స్ లో ఛార్జింగ్ మిగిలుండగానే అనుమానిత ప్రాంతాన్ని సోనార్ పరికరాలతో గాలిస్తే ఉపయోగం ఉంటుందనే భావనతో ఆ రెండు దేశాలు అమెరికా సాయాన్ని కోరాయి. ప్రతికూల వాతావరణంలో చిక్కుకున్న విమానం సముద్రంలో కూలిపోయి అడుగుభాగానికి చేరే అవకాశం ఉందని రెస్క్యూ టీం భావిస్తోంది. కాగా, విమానం జాడ కనిపెట్టేందుకు నావికాదళ గస్తీ విమానాలు, నౌకలు, ప్రత్యేక హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు.