: టీడీపీ, బీజేపీ నేతలు గాడ్సే వారసులు: రఘువీరా విమర్శలు


జాతిపిత గాంధీని క్రూరంగా హత్య చేసిన నాధూరాం గాడ్సేకు గుడి కట్టాలని కొందరు యత్నిస్తున్నారని, కేంద్రంలో అధికారం అనుభవిస్తున్న బీజేపీ, ఆ పార్టీకి మద్దతిస్తున్న టీడీపీ ఆ ప్రయత్నాన్ని వ్యతిరేకించడం లేదని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. టీడీపీ, బీజేపీ నేతలు గాడ్సే వారసులని అన్నారు. కొందరు బీజేపీ నేతలు నెహ్రూని కూడా గాడ్సే చంపి ఉండాల్సిందని బహిరంగంగానే అంటున్నారని ఆయన గుర్తు చేశారు. ఇండియాలో ముస్లిం, క్రిస్టియన్ లను లేకుండా చేయాలని బీజేపీ భావిస్తోందని ఆరోపించారు. రాజధాని ప్రాంత గ్రామాల్లో అగ్ని ప్రమాదాలు విచారకరమని, దోషులను 24 గంటల్లోపు అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని రఘువీరా డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News