: ఊటీ ప్రభుత్వాసుపత్రిలో విషాదం


తమిళనాడులోని సుప్రసిద్ధ పర్యాటక స్థలం ఊటీలోని ప్రభుత్వాసుపత్రిలో విషాదం చోటుచేసుకుంది. గత నాలుగు రోజుల్లో ఐదుగురు బాలింతలు మృతి చెందిన సంఘటన కలకలం రేపుతోంది. ఈ నెల 24 నుంచి ఇప్పటి వరకు కాన్పు కోసం ఆపరేషన్ చేయించుకున్న ఐదుగురు పచ్చి బాలింతలు మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యమే అందుకు కారణమని మహిళల బంధువులు ఆరోపిస్తుండగా, దీనిపై వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేసి, విచారణకు ఆదేశించారు.

  • Loading...

More Telugu News