: జెట్ ఎయిర్ వేస్ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
నేపాల్ లోని ఖాట్మండూ విమానాశ్రయంలో జెట్ ఎయిర్ వేస్ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ తీసుకున్న కాసేపటికే ఓ పక్షి 'ఢీ' కొట్టింది. దీంతో, విమానంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన పైలట్ అప్రమత్తమై ప్రమాదాన్ని నివారించాడు. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.