: హీల్స్ వేసుకుని, బికినీ ధరించి స్టేజ్ పై నడవడం అసహజంగా ఉంటుంది: ప్రియాంక చోప్రా


మిస్ వరల్డ్ పోటీల్లో తాను పాల్గొన్నప్పుడు స్విమ్ సూట్ రౌండ్ లేకపోవడం తన అదృష్టమని నటి, మాజీ మిస్ వరల్డ్ ప్రియాంకా చోప్రా అంటోంది. బికినీ ధరించి స్టేజ్ పై నడవడం అసహజంగా ఉంటుందని చెబుతోంది. 1951 తరువాత నుంచి పోటీల్లో స్విమ్ సూట్ రౌండ్ ను మిస్ వరల్డ్ కంటెస్ట్ నిర్వాహకులు తీసివేశారు. దీనిపై పీసీ తాజాగా స్పందిస్తూ, "హీల్స్ వేసుకుని, బికినీ ధరించి స్టేజ్ పై నడవడం అసహజంగా ఉంటుంది. స్విమ్మంగ్ పూల్ కు గానీ, లేదా బీచ్ కు తీసుకెళ్లి అలాంటివి షూట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అది సహజమైన వాతావరణం కాబట్టి. నాకు నేనుగా చాలా ఇబ్బందిగా భావించా. కానీ నేను మిస్ వరల్డ్ పోటీలో పాల్గొన్న సంవత్సరంలో బికినీ రౌండ్ లేనందుకు సంతోషిస్తున్నా" అని తెలిపింది. ఈ ఏడాది 64వ మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్షిణాఫ్రికాకు చెందిన రోలెన్ స్ట్రాస్ గెల్చుకున్న సంగతి తెలిసిందే. ఈవెంట్ చివరి రౌండ్లో కంటెస్టెంట్ లంతా బికినీలు ధరించడం కార్యక్రమానికే హైలెట్ గా నిలిచింది.

  • Loading...

More Telugu News