: నా కేసుకు నేనే జడ్జిని... నేను ఏ కోర్టుకూ వెళ్లను: దావూద్ ఇబ్రహీం


అండర్ వరల్డ్ డాన్, ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, 1993 ముంబై పేలుళ్ల కీలక నిందితుడు దావూద్ ఇబ్రహీం కరడుగట్టిన మనస్తత్వానికి అద్దం పట్టే గట్టి ఆధారాలతో పాటు అతడు పాకిస్థాన్ లోనే ఉన్నాడని చెప్పేందుకు సరిపడా ఆధారాలు తాజాగా లభ్యమయ్యాయి. ఇటీవల అతడు తన వ్యాపార సామ్రాజ్య విస్తరణకు సంబంధించి తన అనుయాయులతో మాట్లాడిన ఆడియో టేపులు వెలుగు చూశాయి. ‘‘నేను ఏ కోర్టుకు హాజరు కాను. నేనే సొంతంగా కోర్టును కలిగి ఉన్నాను. నా కేసుకు నేనే జడ్జిని. నేనెవ్వరికీ అన్యాయం చేయను. అర్థమైందా?’’ అంటూ తన అనుచరులను హెచ్చరిస్తున్న అతడి కరుకు వ్యాఖ్యలు సదరు ఆడియో ద్వారా వెలుగులోకి వచ్చాయి. 60 ఏళ్ల వయసులో ఉన్న అతడు, ఇంకా తన చీకటి రాజ్యాన్ని నిర్విఘ్నంగా సాగిస్తున్నాడని చెప్పడానికి నిదర్శనంగా ఈ ఆడియో టేపు నిలుస్తోంది. పాక్ లో ఉంటూనే పలు దేశాల్లో నెట్ వర్క్ ను కొనసాగిస్తున్న అతడు, దుబాయి లాంటి విలాసవంతమైన ప్రాంతాల్లో విలువైన ఆస్తులు కలిగి ఉన్నాడు. మెయిల్ టుడే ఈ టేపులను సంపాదించింది.

  • Loading...

More Telugu News